Reading Time: < 1 minute

కుప్పకూలిన బంగారం రేటు.. 10 గ్రాములకు రూ.4వేల 300 తగ్గిన 24 క్యారెట్ల గోల్డ్

Caption of Image.

ఈ నెల ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో కుప్పకూలుతున్నాయి. ఒకపక్క ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ మెుదటికి వస్తున్నట్లు కనిపిస్తున్న వేళ అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లు మాత్రం భయాందోళనల మధ్య కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్లు ఏఐ, క్రిప్టో పెట్టుబడులకు కూడా దూరంగా జరుగుతుండటంతో పసిడి ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొందని  నిపుణులు చెబుతున్నారు. అయితే తగ్గిన రేట్లతో ఖుషీగా ఉన్న భారత ప్రజలు షాపింగ్ చేయాలనుకుంటున్నట్లయితే తమ నగరాల్లో నేటి ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం. 

జూన్ 10న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. జూన్ 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.430 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 886గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 645గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 10, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలకు తగ్గింది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది.  

©️ VIL Media Pvt Ltd.