
Shikhar Dhawan Jacket: క్రికెట్ పిచ్‌పై బౌలర్లను ఉతికేయడమే కాదు, మైదానం బయట తన కిర్రాక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో ఎలా ట్రెండ్ అవ్వాలో ‘గబ్బర్’ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. టీమిండియా మాజీ ఓపెనర్.. ఈ మధ్య ‘లల్లన్‌టాప్’ (Lallantop) వాళ్ల ఫేమస్ క్రికెట్-కామెడీ షో ‘క్రికెట్ దర్బార్’ (Cricket Darbar) లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే, ఈసారి షోలో ఆయన పంచిన నవ్వుల కంటే.. ఆయన వేసుకున్న ఒక ఖరీదైన, రాయల్ ఔట్‌ఫిట్ (Outfit) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రాయల్ లుక్.. రూ. 89,900 లగ్జరీ జాకెట్:
* స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్న శిఖర్ ధవన్.. సింపుల్‌గా ఉండే బ్లాక్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకున్నాడు. కానీ, దానిపై ఆయన ధరించిన మిడ్‌నైట్ బ్లూ కలర్ స్టేట్‌మెంట్ జాకెట్ మాత్రం లుక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
* డిజైన్ స్పెషాలిటీ: లగ్జరీ ఇండియన్ మెన్స్‌వేర్ బ్రాండ్ ‘జిగర్ మాలి’ (Jiger Mali) డిజైన్ చేసిన ఈ కస్టమ్-మేడ్ జాకెట్‌పై నైపుణ్యం కలిగిన కళాకారులతో చేతితో చేసిన క్లిష్టమైన ‘జర్దోజీ’ (Zardozi) ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది.
* ధర ఎంతో తెలుసా: ఈ రాయల్ లుక్ ఇచ్చే లగ్జరీ జాకెట్ ఖరీదు అక్షరాలా రూ. 89,900.
* యాక్సెసరీస్: ఈ రాయల్ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా మెడలో బ్లూ స్టోన్ పెండెంట్ ఉన్న సిల్వర్ చైన్ వేసుకుని తన పర్సనల్ స్టైల్‌ను మరింత ఎలివేట్ చేశాడు.
సైలెంట్ కాన్ఫిడెన్స్.. స్ట్రాంగ్ ప్రెజెన్స్:
ఈ డ్రెస్ గురించి డిజైనర్ జిగర్ మాలి మాట్లాడుతూ.. మేము ఏ Bespoke (కస్టమ్-మేడ్) డ్రెస్ డిజైన్ చేసినా అది ఒక స్కెచ్‌తో కాదు, ఆ వ్యక్తి వ్యక్తిత్వంతో మొదలవుతుంది. శిఖర్ ధవన్ కోసం ఈ జాకెట్ డిజైన్ చేస్తున్నప్పుడు.. ఆయనకున్న సైలెంట్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబించేలా చేయాలనుకున్నాను.. భారతీయ హస్తకళల గొప్పదనాన్ని, ఆధునిక శైలిని కలిపి దీనిని సిద్ధం చేశాం.. ఇందులో ప్రతి కుట్టు ఒక కథ చెప్తుందని వెల్లడించాడు.
►ALSO READ | బెంచ్‌కే స్టార్ ప్లేయర్ ?.. పాక్తో ఆడే భారత్ ఉమెన్ ప్లేయింగ్ XI ఇదే!