Reading Time: < 1 minute
GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

Gujarat Titans vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడ అందించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, రెండు వరుస ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్‌కతా 20 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయింది.

ఛేజింగ్ లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్ ఆడాడు. గిల్ 27 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జోస్ బట్లర్ 25 పరుగులకు, సాయి సుదర్శన్ 22 పరుగులకు అవుటయ్యారు.

కేకేఆర్ తరపున, కామెరాన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. కగిసో రబాడా 3 వికెట్లు తీసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ స్కోరుబోర్డు

రెండు జట్లు..

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంపాక్ట్ ప్లేయర్లు: షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, ఖజ్రోలియా, రావత్.

కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.