
హైదరాబాద్ సిటీలో భారీవర్షం కురిసింది. శుక్రవారం (జూన్12) ఉరుములు, మెరుపులతో సిటీవ్యాప్తంగా జోరువాన కురవడంతో జనజీవనం స్తంభించింది. రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
బంజారాహిల్స, జూబ్లీహిల్స; మెహదీపట్నం లో భారీ వర్షం కురిసింది. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో ఉరుములతో కూడిన వర్షం పడింది. నిజాంపేట్ , బాచుపల్లి, ప్రగతినగర్ లో మోస్తరు వాన కురిసింది.
కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ మచ్చ బొల్లారంలో వర్షం బీభత్సం సృష్టించింది. నార్సింగి, మణికొండ, పుప్పాలగూడలో వాన దంచికొట్టింది. బండ్లగూడ జాగీర్, కిస్మత్ పురా ,హిమాయత్ సాగర్ లో మోస్తరు వర్షం పడింది. నాంపల్లి, అబిడ్స, కోఠి, బషీర్ బాగ్ లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది.