
సాకర్ పండుగ వచ్చేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ 23వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. చరిత్రలో మొదటిసారిగా అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. అంతేకాదు, ఈసారి జట్ల సంఖ్యను కూడా 32 నుంచి ఏకంగా 48కి పెంచారు. అంటే గత సీజన్ కంటే అదనంగా మరో 16 జట్లకు వరల్డ్ కప్ ఆడే అవకాశం లభించింది. అయితే ఇంత పెద్ద టోర్నీ, పైగా జట్ల సంఖ్య పెరిగినప్పటికీ.. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం ఈ 48 జట్లలో లేకపోవడం క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అసలు మన టీం ఈ టోర్నీలో ఎందుకు లేదనే విషయం చూసుకుంటే.
ఆసియా క్వాలిఫైయర్స్‌లో చేజారిన సువర్ణ అవకాశం
ఫిఫా ప్రపంచకప్ 2026 సెలెక్షన్స్‌లో భాగంగా భారత జట్టు ఆసియా క్వాలిఫైయింగ్ గ్రూప్ లో ఆడింది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు ఖతార్, కువైట్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా పాల్గొన్నాయి. అయితే నిబంధనల ప్రకారం.. గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మాత్రమే వరల్డ్ కప్ తదుపరి రౌండ్ టికెట్ లభిస్తుంది. అయితే ఈ గ్రూప్ నుండి ఖతార్, కువైట్ జట్లు అద్భుత ప్రదర్శనతో టాప్-2 లో నిలిచి ముందడుగు వేయగా.. భారత జట్టు మూడో స్థానానికి పరిమితమై వరల్డ్ కప్ రేసు నుండి తప్పుకుంది.
క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఏం జరిగింది.
ఫుడ్ బాల్ సెలక్షన్ క్వాలిఫెయింగ్ రౌండ్‌లో భారత్ మిగిలిన మూడు జట్లతో చెరో రెండు మ్యాచ్‌ల చొప్పున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడింది మొదటి మ్యాచ్‌లో భాగంగా కువైట్‌తో తలబడిన భారత్ 1-0 తో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో బలమైన ఖతార్ జట్టు భారత్‌ను 3-0 తో ఓడించింది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో డ్రాగా ముగియగా.. నాలుగో మ్యాచ్‌లో అఫ్ఘాన్ చేతితో 1-2 తో ఓడిన భారత్ వరల్డ్ కప్ కలలకు గండిపడింది. ఇక ఐదు, ఆరో మ్యాచుల్లోనూ భారత్ ఓటమి చవిచూసి వరల్డ్ రేసు నుంచి తప్పుకుండి.
ఈ రౌండ్‌లో ఫలితాలు ఇలా
ఈ మొత్తం రైండ్‌లొ ఖతార్ 5 విజయాలు, 1 డ్రాతో 16 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలివగా. 2 విజయాలు, 3 ఓటములు, 1 డ్రాతో 7 పాయింట్లు సాధించి కువైట్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక భారత్, ఆఫ్ఘనిస్తాన్ తలా 5 పాయింట్లతో 1 విజయం, 3 ఓటములు, 2 డ్రాలు నిలిచాయి. అయితే, గోల్స్ తేడాతో భారత్ -4, ఆఫ్ఘనిస్తాన్ -11, భారత్ మూడో స్థానంలో, ఆఫ్ఘనిస్తాన్ నాల్గో స్థానంలో నిలిచాయి.
2030 వరల్డ్ కప్‌లో భారత్ ఆడుతుందా?
2030 ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి 100 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో టోర్నీని మొత్తం 6 దేశాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. మొరాకో, పోర్చుగల్, స్పెయిన్ ప్రధాన ఆతిథ్య దేశాలుగా ఉండనుండగా, మొదటి మూడు మ్యాచ్‌లు దక్షిణ అమెరికా దేశాలైన ఉరుగ్వే, అర్జెంటీనా, పరాగ్వేలలో నిర్వహించనున్నారు.
ఈ 2030 టోర్నీకి భారత్ అర్హత సాధిస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. దీనికి సంబంధించిన క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు 2027, 2028లలో జరుగుతాయి. ఒకవేళ భారత్ అర్హత సాధించాలంటే ఆసియా ఖండం నుండి కేటాయించే 8 లేదా 9 స్థానాల్లో చోటు దక్కించుకోవాలి. దీనికోసం జపాన్, సౌత్ కొరియా, ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఖతార్ వంటి బలమైన జట్లను భారత్ దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న భారత్, రాబోయే రోజుల్లో కనీసం టాప్ 70-80 లోకి రావాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.