Reading Time: < 1 minute
Director Vv Vinayak At Trimurthulu Trailer Launch Shares Jr Ntr Aadi Movie Flashback

Director VV Vinayak: డైరెక్టర్ వి.వి.వినాయక్ కెరీర్‌ను, టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆది’. జూనియర్ ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే అసలు ఈ సినిమా డైరెక్షన్‌కు వినాయక్‌కు ఛాన్స్ ఎలా వచ్చింది? ఎన్టీఆర్‌తో ఆయనకు మొదటి పరిచయం ఎక్కడ జరిగింది? అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా జరిగిన త్రిమూర్తులు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ వి.వి.వినాయక్ వెల్లడించారు.

తాను డైరెక్టర్ కాకముందు చివరిగా ఒక సినిమాకు కో-డైరెక్టర్‌గా పని చేశానని వినాయక్ తెలిపారు. “నేను కో-డైరెక్టర్‌గా చేసిన ఆ సినిమాలో హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) గారు నటించారు. ఆ సినిమా సమయంలోనే నాకు ‘ఆది’ కథ ఐడియా వచ్చింది. అయితే ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించే అవకాశం ఎలా వచ్చిందంటే.. ఒకసారి నేను ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాను. సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నారు” అని వినాయక్ చెప్పారు. “స్విట్జర్లాండ్‌లోనే నాకు తారక్‌తో మొదటి పరిచయం ఏర్పడింది. అక్కడ కలిసినప్పుడు తారక్‌కు ‘ఆది’ లైన్ చెప్పడం, ఆయనకు బాగా నచ్చడం జరిగిపోయాయి. అలా వడ్డే నవీన్ గారి సినిమా సమయంలో అనుకున్న కథ.. స్విట్జర్లాండ్‌లో ఎన్టీఆర్‌తో పరిచయానికి దారితీసి, అది ‘ఆది’ సినిమాగా రూపుదిద్దుకుంది” అని వినాయక్ ఆ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒక చిన్న కో-డైరెక్టర్ స్థాయి నుంచి ఇండస్ట్రీ మెచ్చే రేంజ్ డైరెక్టర్‌గా మారడం వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.