టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.
సినిమాలతో పాటుపలు సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించారు రాజా రవీంద్ర. తన దైన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 100 కి పైగా సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర
సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ లాంటి చాలామంది స్టార్ హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు రాజా రవీంద్ర.
రాజా రవీంద్ర ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈయన భార్య పేరు వెంకట రమాదేవి. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వీరి పేర్లు ప్రణతి, వాగ్దేవి. రాజా రవీంద్ర గారి ఇద్దరు కూతుర్లకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు
కాగా ఇప్పుడు రాజా రవీంద్ర ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో రాజా రవీంద్ర మనవలు, మనవరాళ్లు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




