
Virat Kohli: విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. తాజాగా మరో వివాదం దుమారం రేపుతోంది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని ‘లైక్’ వివాదం చుట్టుముట్టింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ తీవ్రమవుతోంది. 2025లో, కోహ్లీ భారత మోడల్/ఇన్‌ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ ఫోటోను పొరపాటున లైక్ చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలోని అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ దీనిపై వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు అల్గారిథమ్ వల్ల పొరపాటున జరిగిన ఇంటరాక్షన్ అని, దీని వెనుక ఎటువంటి ఉద్దేశం లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది.
READ MORE: Iran-Trump: ‘గాలి మేడలు కట్టొద్దు’.. ట్రంప్ యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్
తాజాగా మరోసారి మోడల్ ‘లిజ్‌లాజ్’ (LizLaz) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని ఒక ఫొటోకు కోహ్లీ ప్రొఫైల్ నుంచి ‘లైక్’ కనిపించడంతో సోషల్ మీడియా మరోసారి హోరెత్తిపోతోంది. ఇది చూసిన నెటిజన్లు సెకన్ల వ్యవధిలోనే స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేసేశారు. మీమ్స్ సోషల్ మీడియాకు కుదిపేస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటి వరకు కోహ్లీ స్పందించలేదు. అయితే.. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ సమాజం కనీసం ప్రశాంతంగా లైక్ కూడా చేసుకోనివ్వదు” అని ఒకరు సరదాగా కామెంట్ చేయగా, “రిలాక్స్ గైస్.. ఇది మళ్ళీ అల్గారిథమ్ మహిమే” అని మరికొందరు కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. అవనీత్ కౌర్ విషయంలో ఇచ్చినట్లే, ఇప్పుడు కూడా కోహ్లీ తన టీమ్ ద్వారా మరో వివరణ ఇస్తాడేమోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
READ MORE: Kangana Ranaut : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన కంగనా
ఇక విరాట్ ఫామ్ విషయంలోకి వస్తే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో తన కెరీర్‌లోనే మొదటిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ (49 పరుగులు), ఆర్‌సీబీ సునాయాస విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అటు మైదానంలో పరుగులతో, ఇటు సోషల్ మీడియాలో వైరల్ వార్తలతో కింగ్ కోహ్లీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
Kohli liked this Instagram post we have to bare another algorithm paragraph
pic.twitter.com/DC0dVoxzC4
— mr. villa
(@Luccydevil07) April 16, 2026
Will we see this soon
https://t.co/IJ6yYO8Oii pic.twitter.com/PVnNANLlGR
— Incognito (@Incognito_qfs) April 17, 2026
(@Luccydevil07) 