Reading Time: < 1 minute
Kondapur Drugs Bust Mdma Seized Hyderabad Excise Stf Arrests

Hyderabad: కొండాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్సైజ్ STF బీ టీం నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.09 గ్రాముల ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. సీఐ భిక్ష రెడ్డి, ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో మాధవ హిల్ స్టేట్ ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు. విచారణలో డ్రగ్స్‌ను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మురళి అనే వ్యక్తిని ప్రధాన సరఫరాదారుగా గుర్తించిన అధికారులు, అతడు వికాస్, భరత్ చౌదరి అనే నిందితులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో ఈ ముఠా అక్రమ దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ నగరంలోని అవసరమైన వారికి క్షణాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. గ్రాముకు సుమారు రూ.5 వేల ధరకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్టు చేసిన నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

READ MORE: Virat Kohli: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ మోడల్ ఫోటోను లైక్ చేసిన విరాట్.. మీమ్స్ వైరల్..