
MI vs PBKS: వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించాడు.
Nord CE 6 Lite: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ వచ్చేస్తోంది
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి మొదట్లోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వరుస బంతుల్లో రియాన్ రికెల్టన్ (2), స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (0)లను అవుట్ చేయడంతో 12 పరుగులకే ముంబై 2 వికెట్లు కోల్పోయింది. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా క్వింటన్ డి కాక్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి నమన్ ధీర్ 31 బంతులలో 50 పరుగులతో చక్కని సహకారం అందించడంతో మూడో వికెట్‌కు 122 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది.
Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!
చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (14), షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ (1) నిరాశపరిచినప్పటికీ, తిలక్ వర్మ (8) మెరుపులతో స్కోరు 190 దాటింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 22 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ చెరో వికెట్ తీశారు. భారీ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే 196 పరుగులు చేయాల్సి ఉంది. ముంబై బౌలర్లు ఈ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంటారో లేదో చూడాలి మరి.