Reading Time: 2 minutes
Preethi Nigam: ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తామన్నారు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన బుల్లితెర నటి

ప్రీతి నిగమ్.. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఫొటో చూస్తే ఈ నటిని ఇట్టే గుర్తు పడతారు. పలు టీవీ సీరియల్స్ లో విలన్ గా నటించి మెప్పించారీ అందాల తార. బుతురాగాలు సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన ప్రీతి ఆ తర్వాత కస్తూరి, అనుబంధాలు, దేవదాసు, చక్రవాకం, చంద్రముఖి, సుందర కాండ, కాంచన గంగ, శ్రావణ సమీరాలు, స్వాతి చినుకులు, అమెరికా అబ్బాయి, రుతు గీతం, ఉయ్యాల జంపాల, కంటే కూతుర్నే కను, ఇంటింటి గృహ లక్ష్మి, కలిసుందాంరా తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది. ఎక్కువగా విలన్ పాత్రలతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అలాగే స్టూడెంట్ నెంబర్ వన్, సంతోషం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఈ అబ్బాయి చాలా మంచోడు, కబడ్డీ కబడ్డీ, సై, రెడీ, త్రిపుర, హల్ చల్ తదితర సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్న ప్రీతి ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది .ఇదే క్రమంలో సీరియల్స్ లో తాను పోషించిన విలన్ పాత్రల గురించి మాట్లాడుతూ.

‘ సీరియల్స్ లో విలన్ పాత్ర లు పోషించడం చాలా కష్టం. ఒకసారి విజయవాడలో హోటల్ కి వెళ్లినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ నా వైపు అదోలా చూశాడు. నేను మొదట అతనిని చూసి భయపడ్డాను. ఆ తర్వాత ఎందుకు అలా చూస్తున్నావ్ అని అడిగితే మీరు ఆ సీరియల్స్ లో చేస్తున్నారు కదా.. ఇంట్లో మా నాన్నమ్మ ప్రతిరోజు మిమ్మల్ని తిడుతూ ఉంటుంది అని చెప్పాడు. మరొకసారి వైజాగ్ వెళ్లడానికి ట్రైన్ ఎక్కినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి.. దయచేసి మీరు మా ఊరికి రావద్దు అండి. అక్కడికి వస్తే మా వాళ్లు మిమ్మల్ని కొట్టడం లేక చంపడం జరుగుతుంది అంటూ హెచ్చరించించి’ అని చెప్పుకొచ్చింది. వాళ్లు అలా అనే సరికి మొదట భయం వేసినా నా నటనతో అందర్నీ మెప్పించినందుకు సంతోషమేసింది’ అని చెప్పుకొచ్చింది ప్రీతి.

డాక్టర్ బాబు ఫ్యామిలీతో ప్రీతి నిగమ్..

కాగా ప్రీతి నిగమ్ నటించిన కావ్యాంజలి సీరియల్ లో తన పాత్రకు జాతీయ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం కలిసుందాం రా అనే సీరియల్ లో నటిస్తోందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.