
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో అందరి చూపు ఓ కుర్రాడిపై ఉంది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. తొలి మ్యాచుల్లో వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే.. వైభవ్ త్వరలోనే తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైభవ్‌ను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం వెలువడింది. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించే ఉద్దేశంతో ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ భావిస్తోందట. ఒకవేళ వైభవ్ ఐర్లాండ్ సిరీస్‌లో బరిలోకి దిగితే సచిన్ రికార్డు చెరిగి పోతుంది. ఇదిలా ఉండగా.. టీమిండియాలోకి ఎంట్రీ వైభవ్ ఎంట్రీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్పందించారు. ఓవైపు.. వైభవ్ ప్రతిభను కొనియాడుతూనే, అతడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకువచ్చే విషయంలో తొందరపడవద్దని భారత సెలక్టర్లకు సూచించారు.
READ MORE: Krunal vs Mukul: నీ అంతు చూస్తా.. ముకుల్ చౌదరిని బెదిరించిన కృనాల్ పాండ్య!
జూన్, జూలై నెలల్లో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం షార్ట్‌లిస్ట్ చేసిన 35 మంది ఆటగాళ్లలో వైభవ్ ఒకరన్న వార్తల నేపథ్యంలో ఫించ్ ఈ సలహా ఇచ్చారు. “భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పుడు టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లు ప్రపంచ కప్ గెలిచి, తమను తాము నిరూపించుకున్నారు. కాబట్టి వారికి గౌరవం ఇవ్వాలి. వైభవ్‌ను జట్టుతో ప్రయాణించనిచ్చి అక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది. కానీ, ఏదైనా ఖాళీ ఏర్పడినప్పుడు లేదా ఎవరికైనా గాయాలైనప్పుడు మాత్రమే అతడిని బరిలోకి దించాలి. అతడిని ఒత్తిడికి గురిచేయకుండా తన సహజ సిద్ధమైన ఆటను ఆడనివ్వాలి” అని ఫించ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.