Reading Time: < 1 minute
Thiruveer Paapam Prathap Movie Release Troubles Censor Issue Animal Welfare Board Noc

తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఒక ఊహించని అడ్డంకి ఎదురైంది. సెన్సార్ బోర్డు నుండి అభ్యంతరాలు రావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రమోషన్స్ తో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ‘పాపం ప్రతాప్’ సినిమాకు చివరి నిమిషంలో సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. రేపు (ఏప్రిల్ 17) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి, సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో రిలీజ్ డైలమాలో పడింది. సెన్సార్ నిబంధనల ప్రకారం, సినిమాలో జంతువులను వాడుకున్నప్పుడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుండి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ‘పాపం ప్రతాప్’ టీమ్ ఈ ఎన్ఓసి సమర్పించకపోవడంతో సెన్సార్ బోర్డు తుది సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

Also Read:Roja: రోజా ఈజ్ బ్యాక్.. మళ్ళీ బుల్లితెరపై‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ షురూ!

ఈరోజు సాయంత్రం నుండే ఈ సినిమాకు సంబంధించి పలు చోట్ల ప్రీమియర్స్ ప్లాన్ చేశారు కానీ సెన్సార్ చిక్కుల వల్ల ఈ ప్రీమియర్ షోల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈటీవీ విన్ సహా నిర్మాతలు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది. ₹100 టికెట్ ధరతో సామాన్యుడికి చేరువ కావాలని తిరువీర్ ఎన్నో ప్రమోషన్లు చేశారు. ఇలాంటి టైమ్‌లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం టీంని ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మేకర్స్ అవసరమైన పత్రాలను సమర్పించి లేదా అభ్యంతరకర సీన్లను కట్ చేసి క్లియరెన్స్ తెచ్చుకుంటారు. చూడాలి మరి ఏమవుతుందో?