Reading Time: < 1 minute
Dude Movie World Television Premiere Zee Telugu April 19

తమిళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన రోమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ (Dude) ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఇందులోని పాటలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్, మమితా బైజు యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శరత్ కుమార్, రోహిణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను లాక్ చేసుకుంది.

Also Read : Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు (Zee Telugu) ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 19, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. సండే ఈవెనింగ్ ఫ్యామిలీతో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఇదొక మంచి మూవీ అని చేప్పోచ్చు.