Reading Time: < 1 minute
Retired Teacher Loses Rs 60 Lakh In Digital Arrest Scam In Bapatla

Digital Arrest Scam: పోలీసులు ఎప్పటకప్పుడు డిజిటల్‌ అరెస్ట్ అనేది వట్టిదే.. అదంతా ఓ స్కామ్‌ అని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నా.. చాలా మంది ఇంకా కేటుగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు.. డిజిటల్ అరెస్ట్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు.. రిటైర్డ్ టీచర్ నుంచి 60 లక్షల రూపాయాలు వసూలు చేశారు. బాపట్ల జిల్లా అమృతలూరుకు చెందిన రిటైర్డ్ టీచర్ రామబ్రహ్మంకు కర్ణాటక, తెలంగాణ పోలీసులమని ఫోన్ చేశారు. మీ మొబైల్ నుంచి మహిళలకు‌ అసభ్యకరమైన మెసేజులు వెళ్లాయని, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద రెండు కేసులు నమోదయ్యాయని బెదిరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన స్కాంలో నీ అకౌంట్ లో 75లక్షలు జమ అయ్యాయంటూ బెదిరించారు. కేసుల నుంచి బయటపడేస్తామని నమ్మించారన్నారు. తర్వాత విడతలవారీగా అరవై లక్షల రూపాయలు బదిలీ చేశామన్నారు. మళ్లీ డబ్బులు అడగడంతో స్నేహితుడికి విషయం చెబితే మోసపోయారని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు బాధిత రిటైర్డ్ టీచర్‌..

Read Also: Jangaon District: ఆస్తి కోసం ఇద్దరు కుమారులను లేపేయడానికి తండ్రి మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..