
హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్పరిధిలో దోమల నిర్మూలనపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓయూ ఎంటమాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బానోత్ రెడ్యా నాయక్ దోమల నివారణకు చేయాల్సిన పనులపై ‘ఆపరేషన్ బ్లూప్రింట్-–2026’పై ప్రజెంటేషన్ ఇచ్చారు.
డెంగ్యూ కేసులను 60 శాతం వరకు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ప్రతి వార్డులో డ్రోన్ సర్వేలు, వారానికోసారి ‘డ్రై డే’ చేపట్టాలన్నారు. దోమలు వ్యాప్తి చెందే ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆసరేషన్లు చేపట్టాలన్నారు. జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, సంచిత్ గంగ్వార్
పాల్గొన్నారు.