Reading Time: 2 minutes

Ustaad Bhagat Singh OTT: నెలరోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉస్తాద్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీకి వచ్చేసింది. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ తెలుగు యాక్షన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

థియేటర్ బాక్సాఫీస్‌లో నిరాశపరిచిన ఉస్తాద్.. ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోనుంది. ప్రస్తుతానికి అయితే, సోషల్ మీడియాలో మంచి సందడి నెలకొంది. రానున్న ఈ రెండ్రోజుల్లో డిజిటల్ రంగంలో ఉస్తాద్ పెర్ఫార్మన్స్ ఏంటో తెలుస్తోంది. 

‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్లు:

‘గబ్బర్ సింగ్  వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో మార్చి 19, 2026న థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. మూడో వారం ముగిసేసరికి ఘోరంగా చతికిలపడింది. ఈ క్రమంలోనే నెల రోజులలోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఓవరాల్ రన్లో ఉస్తాద్ వంద కోట్ల మార్క్ను అందుకోలేకపోయింది. ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.72 కోట్లకి పైగా కాగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ.97 కోట్లు మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భారతదేశంలో గ్రాస్ రూ.84.51 కోట్లు,  ఓవర్సీస్ వసూళ్లు రూ.11.85 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. 

కథ:

నల్లమల సమీపంలోని ఓ గూడెంలో మాస్టారు చంద్రశేఖర్ రావు (కె. ఎస్. రవికుమార్) పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. వారిలో చైతన్యం తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అక్కడే అనాథగా ఉన్న చిన్నయ్యను దత్తత తీసుకుని చదువు చెప్పి, అతనికి “భగత్ సింగ్” అని పేరు పెడతాడు. పెద్దయ్యాక ఆ బాలుడు ఏసీపీగా (పవన్ కళ్యాణ్) ఎదిగి మంచి గుర్తింపు పొందుతాడు.

ఈ క్రమంలోనే అడవిలో పాఠాలు చెప్పే మాస్టారు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి సీఎం అవుతారు. అనూహ్యంగా అతని ప్రాణాలు చిక్కులో పడతాయి.  అసాంఘిక శక్తులతో ఉన్న నల్లనాగప్ప (Parthiban) ముఖ్యమంత్రిని లేపేయాలని ఫిక్స్ అవుతాడు. ఇక తన గురువును కాపాడే బాధ్యత ఉస్తాద్ తీసుకుంటాడు. 

మరి ఉస్తాద్ భగత్ సింగ్ తన గురువును ఎలా రక్షించాడు? నల్లనాగప్పతో పోరాటం ఎలా సాగింది? అతని జీవితంలోకి వచ్చిన లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) పాత్రలు ఏమిటి? అన్నదే మిగతా కథ.

©️ VIL Media Pvt Ltd.