
ముంబై: ఐపీఎల్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలేలా ఉంది. ఆ టీమ్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఆర్సీబీతో గత మ్యాచ్‌లో రన్ ఛేజ్ చేస్తున్న సమయంలో ఆరో ఓవర్లో రోహిత్ కాలి కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
సోమవారమే స్కాన్ చేయించుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై మేనేజ్‌మెంట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్ ఇవ్వలేదు. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ పాల్గొనలేదు. దాంతో.. పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో తను ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడింటిలో ఓడిన ముంబై ఒత్తిడిలో ఉంది.