
పంజాగుట్ట, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలు పోవని, మరిన్ని కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఎడ్ టాకీస్ ఫౌండర్ రామ్ అల్లాడి తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని, కోవిడ్ తర్వాత విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ అవసరం మరింత పెరిగిందన్నారు.
ఏఐ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకే తాము ‘ఎడ్ టాకీస్’ను స్థాపించామని, కేజీ నుంచి పీజీ విద్యార్థుల వరకు అందరికీ ఈ యాప్ ఏఐ టీచర్‌గా సేవలందిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి అడాప్టివ్ లెర్నింగ్ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.