Reading Time: < 1 minute
Ranbir Kapoor Times 100 Most Influential List 2026 Update

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ (TIME’s 100 most influential list) అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణ్‌బీర్‌తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్‌బీర్ కావడం గమనార్హం. రణ్‌బీర్ కపూర్ గురించి మరో వెర్సటైల్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ‘టైమ్’ మ్యాగజైన్ కోసం ప్రత్యేక ప్రొఫైల్ రాశారు.

Also Read: Rukmini Vasanth: రుక్మిణి వసంత్ క్రేజీ లైనప్..మరో స్టార్ హీరోతో ‘బంపర్ ఆఫర్’!

‘సాధారణంగా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వసూళ్లనే విజయానికి కొలమానంగా చూస్తారు. కానీ రణ్‌బీర్ వాటన్నింటికీ అతీతంగా తన నటనపైనే దృష్టి సారిస్తాడు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలడు అని ఆయుష్మాన్ కొనియాడారు. గతేడాది ‘యానిమల్’ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన రణ్‌బీర్, ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఆయన రాముడిగా కనిపించనున్నారు. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ అనే క్రేజీ ప్రాజెక్టును కూడా రణ్‌బీర్ లైన్‌లో పెట్టారు.