Reading Time: 2 minutes
Pakistan Cricket Shake Up Coaching Changes Shan Masood Captaincy Decision Ahead Of Bangladesh Tests

Pakistan Cricket: పాకిస్థాన్ జట్టులో తీవ్ర కలకలం రేగింది. రెడ్ బాల్ ట్రోనిలకు సంబంధించి బోర్డు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మే నెలలో బంగ్లాదేశ్‌ తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ తో మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌ లోకి పాక్ అడుగుపెట్టనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ లో భాగంగా జట్టుకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. 2025 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్ డ్రా తర్వాత తొలిసారి పాకిస్థాన్ వైట్ జెర్సీల్లో కనిపించనుంది.

Vaazha 2: తెలుగులోకి మలయాళ 100 కోట్ల బాక్సాఫీస్ షేకర్ ‘వాళా 2’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

గత WTC 2023-25 సైకిల్‌లో చివరి స్థానంలో నిలిచిన పాకిస్థాన్.. ప్రస్తుతం 2025-27 సైకిల్‌లో ఒక విజయం, ఒక ఓటమితో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీనితో జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్ స్థానంపై కూడా చర్చలు సాగుతున్నాయి. ఈమధ్యే జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కూడా భారీ మార్పులు జరిగాయి. 2024 ఏప్రిల్‌లో మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు జాసన్ గిలెస్పీ టెస్ట్ హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత వైట్ బాల్ ఫార్మాట్ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే 2024 డిసెంబర్‌లో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత అకీబ్ జావేద్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినా కొద్ది కాలంలోనే ఆయన స్థానంలో అజర్ మహమూద్ ను నియమించారు. అయితే మహ్మూద్ కూడా కేవలం రెండు టెస్ట్ మ్యాచ్‌ లకే పరిమితమయ్యారు. తాజా సమాచారం ప్రకారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి కోచింగ్ విభాగంలో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను హెడ్ కోచ్‌గా నియమించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన NCAలో రెడ్ బాల్ క్యాంప్‌ను నడిపిస్తూ.. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్నారు.

Film Tittle: ఒక్క సినిమా టైటిల్‌ కోసం రూ.112 కోట్లు.. బాబోయ్ అంత డిమాండ్ ఉందా..?

ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే 2023లో బాబర్ అజాం రాజీనామా తర్వాత టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్, ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 4 విజయాలు, 10 ఓటములు నమోదు అయ్యాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోవడం సంచలనంగా మారింది. ఈ పరిస్థితుల్లో కూడా PCB అతనిపై విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. షాన్ మసూద్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తూ జట్టులో స్థిరత్వాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీనితో బంగ్లాదేశ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనలో జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌లకు కూడా అతనే నాయకత్వం వహించే అవకాశం ఉంది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేదు. 2019-21లో 5వ స్థానం, 2021-23లో 7వ స్థానం, 2023-25లో చివరి స్థానం సాధించింది. దీంతో ఈసారి మెరుగైన ప్రదర్శన చేసి పాయింట్స్ పట్టికలో పైకి రావాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్ రాకతో పాటు, యువ ఆటగాళ్లను తయారు చేసే దిశగా NCAలో క్యాంప్‌లు నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ టెస్ట్ జట్టును బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మార్పులు జట్టుకు ఎంతవరకు ఫలిస్తాయో రాబోయే సిరీస్‌ల్లో తేలనుంది.