Reading Time: 2 minutes
Xiaomi Tv S Mini Led Series 2026 Launched In India 4k Qd Mini Led 144hz Price And Specs Are

Xiaomi TV S Mini LED Series 2026 Launch: షియోమీ (Xiaomi) నుండి కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ Xiaomi TV S Mini LED Series 2026ను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయినా ఈ సిరీస్ ఇప్పుడు భారత్ లోకూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ లో 55, 65, 75 అంగుళాల మూడు సైజుల్లో ఈ టీవీలు ఉన్నాయి. QD Mini-LED టెక్నాలజీతో రూపొందించిన ఈ టీవీలు ప్రీమియం విజువల్ అనుభవాన్ని అందిస్తాయి.

Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!

ఈ సిరీస్‌లోని 75 అంగుళాల మోడల్‌ టీవీలో 512 లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం ప్రత్యేకత. దీని ద్వారా బ్యాక్‌ లైట్ కంట్రోల్ మెరుగుపడి.. మరింత కాంట్రాస్ట్, క్లారిటీ లభిస్తుంది. అన్ని మోడళ్లలో గరిష్టంగా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించబడుతోంది. డిస్‌ప్లే విషయానికి వస్తే 4K UHD (3840×2160) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీల వీయింగ్ యాంగిల్‌తో ఈ టీవీలు అద్భుతమైన విజువల్ క్వాలిటీని అందించనున్నాయి. HDR10+, డాల్బీ విజన్, HLG, ఫిలిం మేకర్ మోడ్ వంటి ఫీచర్లతో సినిమా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా MEMC, AI గేమ్ బూస్ట్ వంటి ఫీచర్లు గేమింగ్, ఫాస్ట్ మూవింగ్ కంటెంట్‌ను స్మూత్‌గా చూపిస్తాయి.

ఈ టీవీలలో ఆడియో పరంగా చూస్తే.. 34W సౌండ్ అవుట్‌పుట్‌తో 4 స్పీకర్ యూనిట్లు (2 ట్వీటర్లు + 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు) అందించబడ్డాయి. డాల్బీ ఆడియో, DTS:X, DTS Virtual:X సపోర్ట్‌ తో సౌండ్ అనుభవం థియేటర్ స్థాయిలో ఉంటుంది. ఈ టీవీలు ‘గూగుల్ టీవీ’ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. Quad-core Cortex A55 ప్రాసెసర్, Mali-G52 GPU, 2GB RAM, 32GB స్టోరేజ్‌తో స్మూత్ పనితీరును అందిస్తాయి. కనెక్టివిటీ పరంగా Wi-Fi 6, బ్లూటూత్ 5.2, HDMI 2.1, USB పోర్టులు, ఈథర్నెట్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

Peddi: జూన్’కి ‘పెద్ది’ వాయిదా.. టీం అధికారిక ప్రకటన.!

ధరల విషయానికి వస్తే.. 55 అంగుళాల మోడల్ ధర రూ. 51,999గా, 65 అంగుళాల మోడల్ రూ. 71,999గా, 75 అంగుళాల మోడల్ రూ. 99,999గా నిర్ణయించారు. ఈ టీవీలు అమెజాన్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. ప్రి-బుకింగ్ ఆఫర్లలో భాగంగా HDFC, ICICI క్రెడిట్ కార్డులతో రూ. 3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ. 6,499 విలువైన 4 సంవత్సరాల కంప్రెహెన్సివ్ వారంటీ ఉచితంగా అందిస్తున్నారు.