Reading Time: < 1 minute
India Bloc Opposes Delimitation Bill Kharge Parliament Special Session

డీలిమిటేషన్‌‌పై ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రెండు గంటల పాటు నేతల మధ్య సమావేశం జరిగింది.

ఇది కూడా చదవండి: Iran-US: చర్చలు విఫలం కాగానే రహస్యంగా వెళ్లాల్సి వచ్చింది.. అమెరికాపై ఇరాన్ సంచలన ఆరోపణలు

అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కూటమి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కానీ డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లుగా వెల్లడించారు. ‘‘మేము మహిళా రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వం బిల్లులను తీసుకువస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజకీయ ప్రేరేపితం. మేము డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాం.’’ అని ఖర్గే అన్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘మహా’ ఘోరం.. 180 మందిపై లైంగిక దాడి.. నిందితుడి ఇల్లు కూల్చివేత

రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించనున్నారు. అయితే తాజాగా బిల్లులపై ఇండియా కూటమి భిన్న స్వరం వినిపించింది. దీంతో మరోసారి పార్లమెంట్ ఉభయ సభల్లో రగడ జరగడం ఖాయంగా అనిపిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాలు మేలు పొందుతాయని దక్షిణాది రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు.