Reading Time: < 1 minute
ఇవెక్కడి లీకుల్రా బాబూ.. తలలు పట్టుకుంటున్న మేకర్స్

ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతోంది? అక్కడేం జరుగుతోంది? ఈ క్యూరియాసిటీ కొంప ముంచుతోందంటున్నారు మేకర్స్. చిన్న సినిమాలకు లేని ఈ ఇబ్బంది పెద్ద సినిమాలను పట్టి పీడిస్తోంది. మేం మీకోసం ఏదో చేస్తున్నాం.. మీరు స్పాయిల్‌ చేయకండి అంటూ బతిమలాడించుకునేలా చేస్తోంది.. మరికొన్ని సార్లు ‘ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం’ అనే బెదిరింపులు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఫౌజీ సినిమా రిలీజ్‌ డేట్ గురించి మాట్లాడుకోవాల్సిన టైమ్‌లో లీకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. వెండితెర మీద విజువల్‌ వండర్‌ని సిద్ధం చేస్తుంటే, మీరు లీక్‌ చేస్తామంటే ఎలా? అలా ఎవరైనా లీక్‌ అయిన పిక్స్ ని షేర్‌ చేస్తే చర్యలు తీసుకోక తప్పదు అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చేస్తు్న్నారు మేకర్స్. ఇప్పుడు ఫౌజీ పరంగానే కాదు, గతంలో పుష్ప సీక్వెల్‌ విషయంలోనూ కొందరు ఇలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్వించారు. కొన్ని వీడియోలు, ఫైట్‌ సీక్వెన్సులు ఇంటర్నెట్‌లో దర్శకమిచ్చాయి. గేమ్‌ చేంజర్‌ సమయంలోనూ ఈ బెడద కనిపించింది. ఆ మధ్య దేవర సినిమాలో సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఫైట్‌ సీన్‌, పాటలోని కొన్ని సీక్వెన్స్ లీక్‌ అయ్యాయి. ఓజీ విషయంలోనూ ఈ బెడద తప్పలేదు. సినిమాలోని అంశాలను ఎంతకెంత దాచి పెట్టాలని మేకర్స్ అనుకుంటారో, అంతకంత లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. తన సెట్‌ నుంచి క్లిప్పు బయటకు రావడాన్ని తట్టుకోలేరు జక్కన్న. అలాంటిది వారణాసి నుంచి కొన్ని పిక్స్ లీక్‌ అయ్యాయి. సలార్‌ సినిమా టైమ్‌లోనూ ఇలాంటి ఇబ్బందుల్నే ఫేస్‌ చేశారు మేకర్స్. సినిమా రేంజ్‌ పెరిగే కొద్దీ, డిజిటల్‌ లీక్స్ కూడా పెరుగుతున్నాయని, ఏవి ఎటు వైరల్‌ అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉందని అంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది