
అన్నీ బావున్నప్పుడు ఎవరో వచ్చి ఏమీ సపోర్ట్ చేయక్కర్లేదు. కాసింత అటూ ఇటూగా ఉన్నప్పుడే ఆదరణ కోసం ఎదురుచూస్తుంటాం. మామూలు నీడ దొరికితే చాలనుకుంటున్న సమయంలో మహావృక్షం కింద నిలబడే ఛాన్స్ వస్తే, ఎగిరి గంతులేయకుండా ఉండగలమా? రామాయణ మేకర్స్ పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నట్టుంది. రాముడి పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు రామాయణ మేకర్స్. రాముడిగా రణ్‌బీర్ సాఫ్ట్ గా కనిపించడం లేదని, టఫ్‌గా ఉన్నారని, ఆ గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయని, అవేం విజువల్స్ అనీ, ఎక్కడా ఎగ్జయిటింగ్‌గా లేదనీ.. రకరకాల కామెంట్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. వాటి మీదే స్పందించారు బాలీవుడ్ గ్రీక్ గాడ్. రామాయణ సినిమా చూడకముందే ఇన్ని కామెంట్స్ ఎందుకన్నది హృతిక్ ప్రశ్న. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఒకే రకంగా ఉండవని, అందులోనూ రకరకాలుగా ఉంటాయని, తమ కథకు, టోన్‌కు తగ్గట్టు మేకర్స్ వాటిని ఎంపిక చేసుకుంటారని, తుది ప్రాడక్ట్ చూశాకనే వాటి గురించి మాట్లాడాలని అన్నారు హృతిక్. అంతే కాదు, తన దృష్టిలో కల్కి డైరక్టర్‌తో పాటు చాలా మంది హీరోలున్నారన్నారు. కల్కి డైరక్టర్, బాహుబలి డైరక్టర్, కోయీ మిల్‌గయా, క్రిష్ చిత్రాల దర్శకులు తన దృష్టిలో హీరోలంటారు హృతిక్. అంతకు ముందు ఎవరూ ఊహించని విషయాలను స్క్రీన్ మీదకు తీసుకురావడం మామూలు విషయం కాదని, వాళ్ల ప్రయత్నం ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫైనల్ ప్రాడెక్ట్ వచ్చేవరకు ఆగాలని అంటున్నారు హృతిక్. సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో డ్యామేజ్‌ని అడ్డుకోవడానికి సెలబ్రిటీలు ఇలా ముందుకు రావడం ఆనందంగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్
Biker Collection: బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక