
తన హస్కీ టోన్‌తో.. అప్పట్లో ఓ మ్యూజిక్ లవర్స్ మదిని దోచేసిన రమణ గోగుల.. మధ్యలో ఎందుకో గ్యాప్ ఇచ్చాడు. రీసెంట్‌గా తన గొంతును మళ్లీ సవరించి గోదారి గట్టు మీద అనే సాంగ్ పాడుతూ మన ముందుకు వచ్చాడు. సేమ్ మునుపటి మ్యాజిక్‌ను క్రియేట్ చేసి.. మ్యూజిక్ లవర్స్‌ను మైమరిచిపోయేలా చేశాడు. ఇప్పుడీయనే ‘గులాబ్ జామ్’ అనే గమ్మత్తైన సాంగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. యంగ్ హీరో రాగ్ మయూర్‌ను కూడా తనతో పాటే వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. సివరపల్లి సీరిస్‌తో… అందర్నీ ఆకట్టుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాగ్ మయూర్.. ప్రస్తుతం ‘అనుమాన పక్షి’ అనే సినిమా చేస్తున్నాడు. డీజె టిల్లుతో సూపర్భ్ సక్సెస్ కొట్టిన విమల్ కృష్ణ ఈ మూవీకి డైరెక్టర్. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా నుంచే రీసెంట్‌గా గులాబ్ జామ్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. గోదారి గట్టు మీద సాంగ్ తర్వాత.. రమణ గోగుల పాడిన ఈ సాంగ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ట్యూన్ ఒక హైలెట్ అయితే .. కిట్టు అందించిన లిరిక్స్ కొత్తగా ఉండడంతో.. ఈ సాంగ్ ఇప్పుడు క్రేజీ రియాక్షన్‌ను సొంతం చేసుకుంటోంది. లిరిక్స్‌లో కాస్త కామెడీ టచ్ ఉండడం కూడా ఈ సాంగ్ వైరల్ కు కారణం. అందుకే బిట్లు బిట్లుగా ఈ సాంగ్ ఇన్‌స్టాలో తిరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది
Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్