Reading Time: 2 minutes

Virat Kohli: రోహిత్ శర్మ కాదు.. టీ20లో క్రిస్ గేల్‌నే బెస్ట్ ఓపెనర్ అంటున్న కోహ్లీ

Caption of Image.

Virat Kohli: త్వరలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆర్సీబీ  విడుదల చేసిన ఒక వీడియోలో కింగ్ విరాట్ కోహ్లీ ‘దిస్ ఆర్ దట్’ అనే గేమ్ లో పాల్గొన్నారు. ఇందులో ఇద్దరు ఆటగాళ్ల పేర్లు చెప్పగా వారిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించిన రౌండ్‌లో కోహ్లీకి పలు ఆప్షన్స్ ఇచ్చారు. మొదట ఆడమ్ గిల్‌క్రిస్ట్– సునీల్ నరైన్ మధ్య ఎంపిక చేయగా, కోహ్లీ గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్నారు. ఆ తర్వాత గిల్‌క్రిస్ట్– ట్రావిస్ హెడ్ మధ్య  పోటీ ఉండటంతో హెడ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. చివరికి రోహిత్ శర్మ– క్రిస్ గేల్ మధ్య పోటీ నెలకొంది.. కొద్దిసేపు ఆలోచించిన అనంతరం కోహ్లీ గేల్‌ను బెస్ట్ టీ20 ఓపెనర్‌గా ఎంచుకున్నారు.

వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అన్ని టీ20 ఫార్మాట్లలో కలిపి 455 ఇన్నింగ్స్‌లలో 14,562 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో కూడా గేల్ అద్భుత రికార్డులు సొంతం చేసుకున్నాడు. మొత్తం 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశారు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా గేల్ పేరిటే ఉంది. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పుణే వారియర్స్ ఇండియాపై 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

►ALSO READ | Delhi Capitals: ఐపీఎల్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కి బిగ్ షాక్.. మెంటర్గా తప్పుకున్న పీటర్సన్

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 159 మ్యాచ్‌లలో 4,231 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో 272 మ్యాచ్‌ల్లో 7046 పరుగులు సాధించారు. ఇదిలా ఉండగా కోహ్లీ త్వరలో మళ్లీ మైదానంలోకి దిగనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మార్చి 28వ తేదీన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా పోటీ పడనుంది. 
 

©️ VIL Media Pvt Ltd.