Reading Time: 2 minutes

Yash Dayal: సిక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆర్సీబీ ప్లేయర్

Caption of Image.

Yash Dayal: టీమిండియా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ యశ్ దయాల్ రహస్యంగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్నాడు యశ్. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్ మనసు గెలుచుకున్న అతడు.. ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. గత నెల (ఫిబ్రవరి)లో జరిగిన ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయినట్లు తెలుస్తుంది. యశ్ దయాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్కడా కూడా షేర్ చేయలేదు. శ్వేతా పుంఢీర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో యశ్‌కి మద్దతుగా పోస్టులు పెట్టింది.

పెళ్లికి ముందు యశ్ దయాల్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడు. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ దయాల్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్ హైకోర్టు అతడికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో దయాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు శ్వేతతో కలిసి ఏడడుగులు వేశాడు. కాగా యశ్ దయాల్ పేరు వినగానే 2023 ఐపీఎల్‌లో రింకూ సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు గుర్తుకు వస్తాయి. ఆ మ్యాచ్ అనంతరం తీవ్ర నిరాశకు గురైన యశ్‌ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రిలీజ్ చేసేసింది. కానీ ఆర్సీబీ యశ్ దయాల్‌పై నమ్మకం ఉంచి 2024లో భారీ ధరకు దక్కించుకుంది.

►ALSO READ | Virat Kohli: రోహిత్ శర్మ కాదు.. టీ20లో క్రిస్ గేల్‌నే బెస్ట్ ఓపెనర్ అంటున్న కోహ్లీ

కాగా ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ ఛాంపియన్‌గా నిలవడంలో యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టి బౌలింగ్ విభాగంలో కీలకంగా మారిపోయాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కారణంగానే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం అతడ్ని రిటైన్ కూడా చేసుకుంది. వరుస విజయాలతో పాటు ఇప్పుడు రహస్యంగా చేసుకున్న పెళ్లి.. ఇలా యశ్ దయాల్ కెరీర్, వ్యక్తిగత జీవితం ప్రస్తుతం ఫుల్ జోష్‌లో కొనసాగుతుంది.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by EPIC MEDIA (@_epic69)

©️ VIL Media Pvt Ltd.