Reading Time: < 1 minute

భోపాల్: గోధుమ చేనులో వృద్ధురాలని ముక్కు, నాలుక కోసి హత్య చేసిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం రాజ్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 70 ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటుంది. తన కుమారుడితో కలిసి వ్యవసాయ పనులకు అప్పుడప్పుడు వెళ్తోంది. కోడలికి తన తల్లిగారింట్లో పని ఉండడంతో రాజస్థాన్ వెళ్లిపోయింది. మంగళవారం కుమారుడు పొలం వ్యవసాయ పనులు చేసి అలసటతో ఇంటికి తిరిగి వచ్చాడు. తన రూమ్‌లో నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి తల్లి కనిపించలేదు. ఇల్లు అంతా వెతికిన తరువాత కూరగాయాలు బయటకు వెళ్లి ఉంటుందని అనుకున్నాడు. ఆమె ఇంకా రాకపోవడంతో గ్రామంలో వెతికాడు.. ఎక్కడ కనిపించకపోవడంతో గోదుమ చేను దగ్గరకు వెళ్లాడు. ఆమె ముక్కు, నాలుక కట్ చేయబడి ఉండడంతో పాటు రక్తపు మడుగులో కనిపించడంతో స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు ఉన్నాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.