Reading Time: < 1 minute

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ కోసం ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణమయ్యారు. హార్ధిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి వెళ్తున్నాడు. కోచ్ గౌతమ్ గంభీర్ ఆమెను చూసిన వెంటనే హగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంభీర్ కాస్తా ఓవర్ చేశారని హార్ధిక్ పాండ్యా అభిమానులు మండిపడుతున్నారు. కాపురాల మధ్య చిచ్చుపెడుతున్నారని పాండ్యా ఫ్యాన్స్ గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ధిక్ పాండ్యా నటాషాతో విడాకులు తీసుకొని ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్‌లో ఉన్నాడు. మహికా శర్మను పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. గత కొన్ని రోజల ఈ ప్రేమజంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. మార్చి 8వ తేదీన అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.