Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులను సైతం తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది అని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పెన్షన్ పెరుగుతుందని ఎదురు చూసిన వృద్ధులకు నిరాశే మిగిలిందని అన్నారు. కోట్లు ఖర్చుచేసి కేరళలో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.4,000 పెన్షన్ ఇస్తాం అని హామీ ఇచ్చి గాలికొదిలేసిందని, వికలాంగులకు పెన్షన్ పెంచడానికి చేతులు రాని సిఎం రేవంత్ రెడ్డి కు కేరళ పత్రికల్లో యాడ్స్ ఇవ్వడానికి చేతులు ఎలా వచ్చాయి? అని  హరీష్ రావు ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ను చెల్లించడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేరళలో మాత్రం తమది అద్భుత పాలన అనే పబ్లిసిటీపై విమర్శించారు. కాంగ్రెస్ ఫేక్ పబ్లిసిటీ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును వాడుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల్లో తగలెయ్యడానికి మీకే హక్కు ఉంది? అని ప్రశ్నించారు. తెలంగాణలో అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి  కేరళ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని, కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని కేరళ ప్రజలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.