Reading Time: < 1 minute

 హైదరాబాద్, టోలీచౌకి భవన ప్రమాదంపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందన్నారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.