Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా 253 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పొయి 253 పరుగులు చేసింది.  టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ (89: 42 బంతుల్లో 8 ఫోర్లు,7 సిక్స్ లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్‌లో చేసి ఔట్ అయ్యాడు.

అయితే ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు. అదిల్ రషీద్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (39:18 బంతుల్లో 4ఫోర్లు,2 సిక్స్ లు) భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. అనవసర పరుగు కోసం యత్నించిన శివమ్ దూబె(43: 25 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్(11), హార్ధిక్ పాండ్యా(27),తిలక్ వర్మ(21) పరుగులు చేశారు. ఇంగ్లాడ్ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, జోప్రా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు.