
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. ఏడుకొండలపై గెస్ట్ హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను మాధురి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే తిరుమల కొండపైకి కేక్‌లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది. అంతకు ముందే వీరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్,
దివ్వెల మాధురి దంపతులు. మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తనూజ కోసం బర్త్ డే కేక్ తెప్పించి కట్ చేయించింది. అంతేకాదు తనూజకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమ తిగా ఇచ్చింది. తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో దివ్వెల మాధురి షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే బంగా రం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న ఫస్ట్ బర్త్‌డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది. ఈ వీడి యో కాస్తా వైరల్ కావడంతో అనుకోకుండా మాధురి వివాదంలో చిక్కుకుంది.