
బెంగళూరు: అత్త కూర వండనివ్వలేదని టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుష్మా అనే యువతి పునీత్ కుమార్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. గతంలో ఆమె డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. ఇప్పుడు మరో కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తోంది. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేసేటప్పుడు అత్త, కొడలు మధ్య గొడవ జరిగింది. కోడలు వంట చేస్తుండగా అత్త వద్దని చెప్పడంతో మనోవేధనకు గురైంది. తన రూమ్‌లోకి వెళ్లి సుష్మా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్త కుమారుడిని తీసుకొని పారిపోయింది. అత్తింటి వారి వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.