Reading Time: < 1 minute

టాలీవుడ్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే వీరిద్దరు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా వీళ్ల టాపిక్ యే కనిపిస్తోంది. చాలాకాలం తమ ప్రేమ విషయాన్ని దాచి పెట్టిన ఈ కపుల్ చాలా దాన్ని బయటపెట్టారు. తామిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ వెల్లడించాడు.

ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘‘మా మొదటి సినిమా ‘గీత గోవిందం’ చేసేప్పుడు మేము కేవలం కో-స్టార్స్‌గా మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాము. మా రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’ సమయంలో మా మధ్య ఉణ్న స్నేహం.. ప్రేమగా మారింది. అందరూ అనుకున్నట్లు నేను కాకుండా, రష్మికనే ప్రపోజ్ చేసింది’’ అని అన్నాడు. దీంతో రష్మికే ముందుగా ప్రపోస్ చేసిందన్న విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, విజయ్, రష్మికలు కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.