July 7, 2026

God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?

God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
Reading Time: < 1 minute
Trivikram Ntr Kumaraswamy Movie Controversy Born In The North Tagline Tamilnadu Protest

కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్‌ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్‌లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. తమిళ మనోభావాలు దెబ్బతీసేలా క్యాప్షన్ ఉందంటూ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్‌టీకే అధినేత సీమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ దేవుడి పుట్టుక గురించి తప్పుడు ప్రచారం చేస్తే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.

కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి సోషల్ మీడియాలో రెండు వర్గాల పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. హిందూ పురాణంలో కుమారస్వామి హిమాలయాల్లో జన్మించారని సినిమా టీం‌కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో గాని, అన్ని అడ్డంకులే! ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కానీ ఏమైందో ఏమో అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్‌లో ‘రాకా’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్‌తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదం మొదలైంది. ఇది రాజకీయ, సాంస్కృతిక చర్చకు దారితీస్తోంది.

వివాదంపై ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. పోస్టర్‌లో కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి రాయడంతో రచ్చ మొదలైంది. ఇదే విషయాన్ని సినిమాలో చూపిస్తే తంబీల మనోభావాలు దెబ్బతినడం ఖాయం, సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటారు. పుట్టిన ప్రదేశం ప్రస్తావన కథలో లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఇంకో 10 నెలల పాటు ఇదే సినిమాతో జర్నీ చేస్తాడు. ఎప్పుడో మొదలై రెండేళ్ల తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గురించి ఇప్పుడే స్పందిస్తారో లేదో చూడాలి మరి.