Jr NTR: ఎన్టీఆర్‌తో ఉన్న ఈ పిల్లోడిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

పై ఫొటోలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? చూడ్డానికి ఎంతో క్యూట్‌గా, చబ్బీగా ఉన్నాడు కదా. తెలుగు సినిమాలు బాగా చూసే వారు అయితే ఈ పిల్లాడు ఎవరో ఈజీగా గుర్తుపట్టేసే ఉంటారు. ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరో. యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అమ్మాయిల కలల రాకుమారుడు. తాత, తండ్రుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఈ 11 ఏళ్లలో కేవలం ఏడు సినిమాలు మాత్రమే చేశాడు. అయితే ఒకటి, రెండు మాత్రమే హిట్స్ ఉన్నాయి. దీంతో ఒక గట్టి బ్లాక్ బస్టర్ కోసం ఈ హీరో ఎదురు చూస్తున్నారు. అభిమానులు కూడా అయ్యగారికి ఒక్క గట్టి హిట్ పడితే స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడంటున్నారు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో జూనియర్‌తో ఎన్టీఆర్‌తో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని.
అఖిల్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా లెనిన్. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం గట్టిగానే ప్రమోషన్లు చేస్తోంది. కాగా లెనిన్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో డబ్బింగ్ స్టూడియోలో ఎన్టీఆర్, అఖిల్ ఇద్దరూ ఎంతో సంతోషంగా ముచ్చటించుకుంటున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇదే క్రమంలో అఖిల్ చిన్న వయసులో ఎన్టీఆర్ తో దిగిన ఫొటో కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది.
ఎన్టీఆర్ తో అక్కినేని అఖిల్..
Thank you Tiger
. Thanks for roaring for #Lenin.
Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother @tarak9999
pic.twitter.com/D2Xd0pZDpH
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2026
ఇక పై ఫొటో విషయానికి వస్తే.. సాంబ సినిమా షూటింగ్ లో దిగినట్లు తెలుస్తోంది. అప్పుడు ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉన్నాడు. అ సమయంలోనే అఖిల్ ఎన్టీఆర్ తో సరదాగా ఫొటో దిగినట్లు సమాచారం. అప్పుడు అఖిల్ వయసు సుమారు పదేళ్లు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
. Thanks for roaring for 