July 8, 2026

Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?

Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?
Reading Time: < 1 minute
Mythri Movie Makers Producer Ravi Shankar Bold Comments On Nepotism Star Kids

Mythri Ravi: టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన వై.రవిశంకర్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం), బ్యాక్‌గ్రౌండ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన ‘రాజా ది రాజా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రవిశంకర్ మాట్లాడుతూ.. “సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ లేదా డైమండ్ స్పూన్‌తో పుట్టి రావచ్చు. కానీ, ఇక్కడ ఆ స్పూన్లు ఏమాత్రం పని చేయవు. ఇండస్ట్రీలో ఒకరిని నిలబెట్టేది, నడిపించేది కేవలం వారిలో ఉన్న స్వయం ప్రతిభ మాత్రమే” అంటూ రవిశంకర్ స్పష్టం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ ఇవ్వడానికే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత ప్రేక్షకులు ఆదరించాలంటే టాలెంట్ ఒక్కటే శరణ్యమని ఆయన చెప్పుకొచ్చారు.

కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటీనటులకు ఆయన ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని ఇస్తూ.. “మన వెనుక ఎవరి అండా లేదు, మనల్ని నడిపించే గాడ్‌ఫాదర్ ఎవరూ లేరని భావించి క్షేత్రస్థాయి నుంచి కష్టపడితేనే పరిశ్రమలో నిజమైన విజయం దక్కుతుంది” అని కొత్త హీరో రిత్విక్‌‌కు దిశానిర్దేశం చేశారు. సినిమా పట్ల అంకితభావం, కష్టపడే తత్వమే కెరీర్‌ను నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రవిశంకర్ చేసిన ఈ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ కష్టపడితేనే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారనే నిజాయితీ గల మాటలను మైత్రీ నిర్మాత ఓపెన్‌గా చెప్పడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.