July 7, 2026

Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్‌ చూశారా?

Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్‌ చూశారా?
Reading Time: < 1 minute
Hrudayam Murali Trailer Thaman Acting Comeback Boys Atharva Mythri Movie Makers

Hrudayam Murali: మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తున్న సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ 20 ఏళ్ల తర్వాత తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ ‘బాయ్స్’ తర్వాత ఆయన మళ్లీ నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. యంగ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇదయం మురళి’ (Idayam Murali). ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో తమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఒక ప్యూర్ రొమాంటిక్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ తెరకెక్కించినట్లు అర్థం అవుతుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి తమనే సంగీతం అందిస్తుండటం. ట్రైలర్‌లో విజువల్స్, అథర్వ లుక్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఈ క్రేజీ మ్యూజికల్ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తెలుగులో రిలీజ్ చేస్తుండటం ఈ సినిమాకు మరింత మైలేజ్ తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బ్లాస్ట్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కయాదు లోహర్, ఫహాద్ ఫాజిల్, నిహారిక నటిస్తున్నారు.