July 7, 2026

వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!

వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!
Reading Time: < 1 minute
వారెవ్వా.. వందేభారత్‌.. వరదనీటిలో దూసుకెళ్తూ సినిమా చూపించిందిగా!

భారీ వర్షాలు కురిసినప్పుడు రైళ్లు నిలిచిపోవడం లేదా నెమ్మదిగా వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ, పట్టాలపై వరద నీరు నిండి ఉన్నా.. వాటన్నింటినీ చీల్చుకుంటూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లిన ఓ అద్భుతమైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబైలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కాంజూర్‌మార్గ్ సమీపంలో రైల్వే పట్టాలు పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏమాత్రం వేగం తగ్గించకుండా నీటిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లింది. రైలు అంత వేగంగా వెళ్లడంతో పట్టాలపై ఉన్న నీరు భారీ కెరటంలా పైకి ఎగిసిపడింది. ఆ నీటి ధారలు ఎంత ఎత్తుకు లేచాయంటే.. పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలపై పడ్డాయి. ఒకవైపు ప్రమాదకరమైన వరద పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు వందే భారత్ దూసుకెళ్లిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు “ఇది పక్కా సినిమా సీన్‌లా ఉంది”, “వర్షంలో వందే భారత్ పరుగు అద్భుతం” అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియో ప్రస్తుత వర్షాల సమయంలోనే చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇది ఎప్పుడు జరిగిందనే విషయంపై రైల్వే అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఈ యాక్షన్ సీన్ లాంటి వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!

ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!

వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి

గుడ్‌న్యూస్‌.. గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Maa Inti Bangaram: ఉత్తర అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు!