
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా. అయితే వీరి విడాకుల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా ‘లాక్ అప్; సచ్ యా సజా’ రియాలిటీ షో వేదికగా తన వైవాహిక జీవితంపై సంచలన నిజాలను బయటపెట్టింది. తమ ఆరేళ్ల బంధానికి ముగింపు పలకడానికి గల కారణాన్ని తన తోటి కంటెస్టెంట్లతో చెబుతూ కన్నీరు పెట్టుకుంది.
పిల్లలు వద్దనందుకే..
రియాల్టీ షోలో శ్రేయ, సూఫీలతో ఆకాంక్ష మాట్లాడుతూ.. తమ విడాకులకు ప్రధాన కారణం పిల్లలు అని స్పష్టం చేసింది. మాకు పెళ్లయిన కొత్తలో నాకు ఎలాంటి మాతృత్వ భావనలు లేవు. భవిష్యత్తులో కలగవచ్చని అనుకున్నాను కానీ, కాలక్రమేణా నేను తల్లి కావడానికి సెట్ అవ్వనని అర్థమైంది. మొదట్లో గౌరవ్ దీనికి ఒప్పుకున్నా, టైమ్ గడిచేకొద్దీ అతని ఆలోచన మారింది. అతనికి పిల్లలు కావాలని బలంగా కోరుకుంటున్నాడు. కానీ నేను అతనికి ఆ సంతోషాన్ని ఎప్పటికీ ఇవ్వలేను అని ఆకాంక్ష ఎమోషనల్ అయ్యింది.
►ALSO READ | హీరోయిన్ని వేధించిన కేసు: జైలు పాలయ్యాక సారీ చెప్పిన వ్యాపారవేత్త.. హనీ రోజ్ రియాక్షన్పై ఆసక్తి!
సమాజంలో 99 శాతం మంది వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికే పెళ్లి చేసుకుంటారని, అందుకే గౌరవ్‌ను కూడా నీకు పిల్లలు కావాలంటే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్లు ఆమె పేర్కొంది. బిగ్ బాస్ షో సమయానికి గౌరవ్‌కు పిల్లలపై ఉన్న ఇష్టం పూర్తిగా అర్థమైందని, అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అయితే దత్తత తీసుకునే ఆలోచన కూడా లేదని.. తను అసలు పిల్లలు లేకుండా పూర్తిగా ఫ్రీగా ఉండాలనుకుంటున్నట్లు ఆకాంక్ష స్పష్టం చేసింది.
సీక్రెట్ సెపరేషన్
గౌరవ్, తాను గత ఏడాది కాలంగా విడివిడిగా ఉంటున్నామని, కానీ సమాజం కోసం, ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ మేనేజ్ చేశామని ఆకాంక్ష తెలిపింది. ఇరు కుటుంబాల పెద్దలు తాము మళ్లీ కలుస్తామని ఆశపడ్డారని, కానీ తమ ఆలోచనలు ఎప్పటికీ కలవవని తేలిపోవడంతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.