
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కథనాయకుడిగా వస్తున్న చిత్రం ‘లెనిన్’. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని’ వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ అబ్బూరు మురళీ కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని జూలై 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా చిత్రం అఫీషియల్ ట్రైలర్ ను వైజాగ్ లో ఈ రోజు ( జూన్ 30, 2026 ) రిలీజ్ చేశారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, లేటెస్ట్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.