Reading Time: 2 minutes

‘మా అమ్మను తిడితే ఊరుకుంటానా’?.. డెలివరీ బాయ్‌తో ఫైట్‌పై అఖిల్ రాజ్ క్లారిటీ.. కేసు నమోదు!

Caption of Image.

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో.. ఎవరు ట్రోలర్స్ బారిన పడతారో ఊహించడం కష్టం. ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ నటుడు అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌తో గొడవ పడుతున్న విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేశాయి. అఖిల్ ఫ్రస్ట్రేషన్‌ను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే, ఈ వివాదంపై లేటెస్ట్ గా అఖిల్ రాజ్ స్పందిస్తూ అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఒక క్లారిటీ వీడియోను వదిలారు. మా అమ్మను తిడితే ఏ కొడుకైనా ఊరుకుంటాడా? నా స్థానంలో మీరున్నా ఇదే చేస్తారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

అఖిల్ వెర్షన్ ఇదే..

మేము అసలు ఫుడ్ ఆర్డరే చేయలేదు. కానీ డెలివరీ బాయ్ వచ్చి పార్సిల్ ఇచ్చాడు.  మా అమ్మ  పొరపాటున ఆ ప్యాకెట్ ఓపెన్ చేసింది. అయితే.. కాసేపటి తర్వాత ఆ డెలివరీ బాయ్ మళ్లీ వచ్చి, ఫ్రీగా వస్తే ఏదైనా తీసేసుకుంటారా అంటూ మా అమ్మను అసభ్య పదజాలంతో దూషించాడు. పైగా తాగి ఉన్న ఆ డెలివరీ బాయ్.. మా ఫ్యామిలీతో గొడవకు దిగాడు. ఒక కొడుకుగా నా కళ్లముందు అమ్మను తిడుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దాంతో అతడు వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు అని అఖిల్ చెప్పుకొచ్చారు.

సెల్ఫ్ రెస్పెక్ట్..

పూర్తి విషయం తెలియకుండా నన్ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నా అఖిల్. నేనూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. గతంలో నేను కూడా డెలివరీ బాయ్‌గా పనిచేశాను. ఆ కష్టం నాకు తెలుసు. మా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్  గురించే మాట్లాడాం. అలాంటిది నేనెందుకు కావాలని గొడవ పడతాను? నాకేం వస్తుంది? అయితే ఆవేశంలో ఊగిపోకుండా.. పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటే బాగుండేది, మరింత పరిణతితో వ్యవహరించాల్సింది. కానీ అమ్మను అనడంతో కంట్రోల్ తప్పాను అంటూ అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ క్లారిటీ వీడియో వైరల్ అవుతుండటంతో.. అమ్మ కోసం ఫైట్ చేయడం కరెక్టే కానీ, సెలబ్రిటీగా కొంచెం ఓపిక పట్టాల్సింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

►ALSO READ | పిల్లలు వద్దు అనుకున్నందుకే విడాకులు.. గౌరవ్ ఖన్నాతో ఆరేళ్ల బంధానికి ముగింపు పలికిన ఆకాంక్ష!

కేసు నమోదు

ఇదిలా ఉండగా నటుడు అఖిల్ రాజ్ పై గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు నమోదైంది. కొండాపూర్ లో తనను అడ్డగించి తనపై దాడికి ప్రయత్నించారని డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు డెలివరి బాయ్ పై కూడా అఖిల్ రాజ్  ఫిర్యాదు చేశారు . దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కేసు వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.