Reading Time: < 1 minute
Alia Bhatt Hero Level Remuneration Yrf Alpha Movie Budget Leak

Alpha Movie Remunerations: బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha). ఆలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేస్తున్న గ్లోబల్ స్టార్ ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లలో ఇది అత్యధిక పారితోషికాలలో ఒకటి కావడం గమనార్హం. మరోవైపు, ఈ సినిమాలో ఆలియాతో పాటు సమానమైన యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్న యంగ్ బ్యూటీ శర్వరి వాఘ్‌కు రూ.3 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విలనిజంలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాబీ డియోల్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ పాత్రకు గానూ ఆయనకు రూ.6 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాల టాక్.

అలాగే ఈ స్పై యూనివర్స్‌లో కీలకమైన ‘రా’ చీఫ్ పాత్రలో కనిపిస్తున్న సీనియర్ నటుడు అనిల్ కపూర్‌కు కూడా బాబీ డియోల్‌తో సమానంగా రూ.6 కోట్లు అందినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కు అత్యంత కిక్కిచ్చే మరో అప్‌డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో ‘ఏజెంట్ కబీర్’గా ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో హృతిక్ రోషన్ కనిపించబోతున్నారట. యశ్‌రాజ్ స్పై యూనివర్స్ సినిమాలన్నింటికీ ఒకదానికొకటి కనెక్షన్ ఉండేలా ప్లాన్ చేస్తుండటంతో.. హృతిక్ ఎంట్రీ ఆల్ఫా రేంజ్‌ని మరింత పెంచేయనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జులై 4న థియేటర్లలో ఈ లేడీ స్పైస్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి మరి.