Reading Time: < 1 minute

నిధి పేరుతో అయినోళ్లే నిండా ముంచారు.. అప్పు చేసి రూ.10 లక్షలిస్తే.. తిరిగి ఇవ్వలే.. తీర్చలేకనే జన్వాడ భార్యాభర్త చచ్చిపోయారు !

Caption of Image.

చేవెళ్ల: శంకర్​పల్లి మండలంలోని జన్వాడకు చెందిన దంపతుల ఆత్మహత్యకు వారు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమే కారణమని పోలీసులు తేల్చారు. జన్వాడకు చెందిన బాలసాయి, జుల్కల్కు చెందిన పద్మ ఏడాదిన్నర కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. 

సాయి ఫొటోగ్రాఫర్‌‌గా పనిచేస్తుండగా, పద్మ ఇంటి వద్దే ఉంటూ కుటుంబాన్ని చూసుకునేది. పద్మ తల్లిదండ్రులు చంద్రయ్య, శాంతమ్మ, మరిది వెంకటేశ్​ కలిసి జుల్కల్లోని వారి ఇంట్లో బంగారు నిధి ఉందని, దాన్ని వెలికి తీసేందుకు డబ్బులు అవసరమని బాలసాయికి చెప్పారు.

దీంతో అతను రూ.10 లక్షలు అప్పు చేసి, వారికి ఇచ్చాడు. తిరిగి అడిగితే నిరాకరించారు. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో బాలసాయి, పద్మ ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి సోదరుడు అరవింద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం చంద్రయ్య, శాంతమ్మ, వెంకటేశ్​ను అరెస్ట్​ చేసి, రిమాండ్​కు తరలించారు.

©️ VIL Media Pvt Ltd.