Reading Time: < 1 minute
Raju Weds Rambai Hero Akhil Raj Car Attacked Delivery Boy Controversy

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్‌పై దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, సదరు డెలివరీ బాయ్ తన తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, అందుకే సీరియస్ అయ్యానని అఖిల్ రాజ్ వివరణ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు.

ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ రాజ్ కారుపై కొంతమంది దుండగులు దాడికి దిగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిల్ రాజ్ టీమ్ షేర్ చేసింది. ఈ దాడి వీడియో వైరల్ అయిన నేపథ్యంలో, గచ్చిబౌలి పోలీసులు అఖిల్ రాజ్‌తో పాటు సదరు డెలివరీ బాయ్‌ని కూడా విచారణకు రమ్మని పిలిచారు.

ఈ విచారణ నేపథ్యంలో, సదరు డెలివరీ బాయ్ హైదరాబాద్ నగరంలోని చాలామంది డెలివరీ బాయ్స్‌ను తనతో పాటు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. అఖిల్ రాజ్ విచారణకు హాజరయ్యేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న క్రమంలో, అతని నివాసానికి కూడా చేరుకున్న కొంత మంది డెలివరీ బాయ్స్ అందరూ అఖిల్ రాజ్ కారుపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, ఈ దాడి వెనుక ఉన్న నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు.