Reading Time: 2 minutes

బెంగళూరుకు మకాం మార్చిన హార్దిక్ పాండ్యా.. ఎందుకంటే!

Caption of Image.

Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరీర్ పరంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కెరీర్ మొత్తం బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లోనే శాశ్వతంగా ట్రైనింగ్ తీసుకోవాలనే లక్ష్యంతో అతను ముంబై నుంచి పూర్తిగా బెంగళూరుకు తన నివాసాన్ని మార్చేశాడు. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్లలో ఇలా సీఓఈ (COE)ని తన పర్మనెంట్ ట్రైనింగ్ బేస్‌గా మార్చుకున్న మొదటి ప్లేయర్ హార్దికే కావడం విశేషం.

బెంగళూరుకి హార్దిక్ షిఫ్ట్: 
సాధారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు కేవలం గాయాల నుంచి కోలుకోవడానికి (Rehab), ఫిట్‌నెస్ పరీక్షల కోసం లేదా జాతీయ క్యాంపుల కోసం మాత్రమే బెంగళూరులోని ఈ సెంటర్‌ను సందర్శిస్తుంటారు. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను సెలక్ట్ చేసుకున్నాడు. 

ముంబైలో ట్రాఫిక్ తిప్పలు.. బెంగళూరులో కొత్త ఇల్లు: 
వాస్తవానికి హార్దిక్ పాండ్యా సొంతూరు గుజరాత్‌లోని బరోడా అయినప్పటికీ, గత దశాబ్ద కాలంగా అతను ముంబైలోనే ఉంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫెసిలిటీస్‌లోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. కానీ, ముంబైలోని తన లోయర్ పరేల్ నివాసం నుంచి రోజువారీ ట్రైనింగ్ కోసం ప్రయాణించడం పెద్ద సమస్యగా మారడంతో అతను ముంబైని వీడాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం బెంగళూరు శివార్లలో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కు అత్యంత సమీపంలో హార్దిక్ ఒక విలాసవంతమైన ప్రాపర్టీని అద్దెకు తీసుకుని ఇప్పటికే అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు.

►ALSO READ | డ్రెస్సింగ్‌రూమ్‌లో వైభవ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అంబటి రాయుడు వ్యాఖ్యలు వైరల్

సొంత జేబు నుంచే డబ్బులు: 
సీఓఈలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే సమయంలో అక్కడ లభించే సదుపాయాలతో పాటు తన కోసం ప్రత్యేకంగా నియమించుకునే నెట్ బౌలర్లకు హార్దిక్ తన సొంత జేబు నుంచే డబ్బులు చెల్లిస్తుండటం విశేషం. అలాగే అఫీషియల్ ట్రైనింగ్ బయట కూడా సాయం చేయడానికి ఒక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ & కండిషనింగ్ (S&C) కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు.

కమ్‌బ్యాక్ ప్లాన్స్: 
ప్రస్తుతం 32 ఏళ్ల వయసున్న హార్దిక్ పాండ్యా క్వాడ్రిసెప్స్ (Quadriceps) గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న యూకే (UK) వైట్-బాల్ పర్యటనకు దూరమయ్యాడు. గత ఆరు నెలలుగా అతను సీఓఈలోనే ఎక్కువ సమయం గడుపుతూ రికవరీ అవుతున్నాడు. హార్దిక్ కనీసం మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు అంతర్జాతీయ వైట్-బాల్ క్రికెట్ ఆడాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే లాంగ్ రన్ కోసం ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

జింబాబ్వే సిరీస్‌తో రీఎంట్రీ?: 
ప్రస్తుతం వ్యక్తిగత పనుల కోసం చిన్న బ్రేక్ తీసుకున్న హార్దిక్.. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ సీఓఈలో రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నాడు. యూకే పర్యటన ముగిసిన వెంటనే జరగబోయే జింబాబ్వే టీ20 సిరీస్ సమయానికి అతను రిటర్న్-టు-ప్లే (Return-to-Play) ప్రోటోకాల్స్ పూర్తి చేసుకుని ఫిట్‌నెస్ సాధిస్తే.. ఆ సిరీస్‌కు ఎంపికవుతాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 

©️ VIL Media Pvt Ltd.