Reading Time: 2 minutes
Central Government: సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. అకౌంట్లోకి నేరుగా రూ.78 వేలు.. ఒక్కొక్కరికీ..

దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక పథకాన్ని అమలు చేస్తోంది. అదే పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన పథకం. 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలవుతోంది. దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా లబ్దిదారులు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశముంది. అయితే ఈ పథకం ద్వారా పేదలు సోలార్ రూఫ్ టాప్ ఇంటిపై ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. నేరుగా లబ్దిదారుడి అకౌంట్లో ఈ సొమ్మును జమ చేస్తోంది. అంతేకాకుండా ఇంటికి సరిపోగా మిగిలిన విద్యుత్ ను డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. నెట్ మీటరింగ్ విధానం ద్వారా డిస్కంలకు విక్రయించవచ్చు.

సబ్సిడీ ఎంత వస్తుందంటే..?

సబ్సిడీ విషయానికొస్తే.. 1 నుంచి 7 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు సబ్సిడీ అందుతుంది. ఇక 2 నుంచి 3 కిలోవాట్స్ సోలార్ ప్లాంట్ కు రూ.60 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. అదే 3 కిలోవాట్లపైబడి ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది.

అర్హతలు ఇవే..

-భారత పౌరులు అయి ఉండాలి

-సొంత ఇల్లు కలిగి ఉండాలి

-ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కలిగి ఉండాలి

-గతంలో ప్రభుత్వం నుంచి సోలార్ ప్లాంట్ సబ్సిడీ పొంది ఉండకూడదు.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

-pmsuryaghar.gov.in వెబ్ సైట్ సందర్శించండి

-రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు అనే ఆప్షన్ ఎంచుకోండి

-అవసరమైన వివరాలు నమోదు చేయండి

-ఎలక్ట్రిసిటీ కన్జూమర్ నెంబర్, మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి

-దరఖాస్తు ఫారం నింపండి

-డిస్కం మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. పోర్టల్ లో నమోదైన వెండర్ ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి

-సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాక పోర్టల్ లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

-నెట్ మీటర్ అమర్చిన తర్వాత డిస్కం అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికేట్ అందిస్తారు.

-అనంతరం బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సిల్ చెక్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి

-30 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి