
IPL 2027 : క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరించే ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఫ్రాంచైజీలన్నీ ఇప్పుడు తదుపరి సీజన్ పై దృష్టి పెట్టాయి. ఐపీఎల్ 2027 సీజన్ కోసం జరగబోయే మెగా వేలానికి ముందే బిగ్గెస్ట్ ట్రేడ్ విండో ఓపెన్ అయింది. ఈ ట్రేడ్ విండో ద్వారా వేలం పాటతో సంబంధం లేకుండా ఫ్రాంచైజీలు పరస్పర అంగీకారంతో తమ ఆటగాళ్లను ఇతర జట్లకు మార్చుకునే (ట్రేడ్) అవకాశం ఉంటుంది. ఈ క్రేజీ విండో మెగా ఆక్షన్‌కు కొన్ని రోజుల ముందు వరకు లైవ్‌లో ఉండనుంది. ఈ ట్రేడ్ విండో ఓపెన్ అయిన కొద్ది రోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మొదటి అధికారిక ట్రేడ్ డీల్ విజయవంతంగా పూర్తయింది. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, మళ్లీ తన పాత జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC)లోకి తిరిగి వచ్చేశాడు. ఈ డీల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అప్పగించింది. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్ల మార్పిడితో ఐపీఎల్ వర్గాల్లో అప్పుడే వేడి రాజుకుంది.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై?
మొదటి డీల్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు అందరి కళ్లు ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై పడ్డాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో చేరబోతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. దీనికి బదులుగా కేకేఆర్ జట్టులో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ మళ్లీ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రెండు డీల్స్ దాదాపు ఖరారైనట్లు టెక్నికల్ వర్గాలు చెబుతున్నాయి.
సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్‌లపై రూమర్స్
ఈ ట్రేడ్ విండోలో కేవలం నార్మల్ ప్లేయర్లే కాకుండా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేరు కూడా గట్టిగా వినబడుతోంది. ముంబై ఇండియన్స్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులోకి వెళ్లే అవకాశం ఉందని, అలాగే రాజస్థాన్‌కు చెందిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అయితే ఇవి కేవలం ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నాయని, ఇంకా ఎలాంటి అధికారిక ఒప్పందాలు జరగలేదని ఇన్‌సైడర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.
దాదాపు ఖరారైన మరికొన్ని క్రేజీ ట్రేడ్ డీల్స్
ఐపీఎల్ కారిడార్లలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దాదాపు 16 మంది ఆటగాళ్ల భవిష్యత్తు ఈ ట్రేడ్ విండో ద్వారా మారబోతోంది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుంచి శివమ్ దూబే ముంబై ఇండియన్స్‌కు, ఖలీల్ అహ్మద్ సిఎస్‌కే నుంచి ముంబైకు వెళ్లడం దాదాపు ఖాయమైంది. అలాగే పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ రాహుల్ చాహర్, గుర్జాప్‌నీత్ సింగ్‌లు చెన్నై నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారబోతున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉన్న విద్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లేందుకు అంతా సిద్ధమైంది.
చర్చల్లో ఉన్న ఇతర స్టార్ ఆటగాళ్ల లిస్ట్
ఇక మిగిలిన ప్లేయర్ల విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ టార్గెట్ చేయగా, కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తెచ్చుకోవాలని చూస్తోంది. వీరితో పాటు చెన్నైకి చెందిన ప్రశాంత్ వీర్ లక్నోకు, అలాగే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారే విషయాలపై కేవలం చర్చలు మాత్రమే నడుస్తున్నాయి. మెగా ఆక్షన్‌కు ముందే ఈ ట్రేడింగ్స్ ఐపీఎల్ అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..